Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Sita Ramam Movie Teaser Launch

Sita Ramam Movie Teaser Launch

 

దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న సినిమా ‘సీతా రామం’ టీజర్ విడుదల 

 

 

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో  అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న దత్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

 

నిమిషం 14 సెకన్ల నిడివిగల ‘సీతా రామం’  టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్ తొలి సన్నివేశం 1965 కశ్మీర్ మంచు కొండలని చూపిస్తూ .. ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వాయిస్ తో మొదలైన టీజర్ విజువల్ వండర్ గా నిలిచింది.    

”లెఫ్టినెంట్‌ రామ్‌. నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ ఈ వాయిస్ ని ఫాలో అవుతూ చూపించిన విజువల్స్, ఎమోషన్స్ మ్యాజికల్ గా వున్నాయి

 

లెఫ్టినెంట్‌ రామ్‌ గా దుల్కర్ సల్మాన్ మెస్మరైజ్ చేశారు. తన గత సినిమాల కంటే ఇందులో మరింత హ్యాండసమ్ గా కనిపిస్తున్నారు దుల్కర్ సల్మాన్. తనకు వచ్చిన ఉత్తరాలను చూసి ‘సీతా.. ఎవరు నువ్వు?’ అని దుల్కర్ అన్నవెంటనే నిండు సంప్రాదాయంగా సీత పాత్ర రివిల్ కావడం హను రాఘవపూడి లవ్లీ మార్క్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ ల కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది.

 

టీజర్ లో ప్రతి ఫ్రేమ్  లావిష్ గా వుంది. సినిమా విజువల్ వండర్ గా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది.  పీఎస్ వినోద్ కశ్మీర్ ని మరింత ఆహ్లాదంగా తన కెమరాతో బంధించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం హార్ట్ టచింగ్ గా వుంది. ప్రొడక్షన్ విలువలు అత్యున్నతంగా వున్నాయి. వండర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కథనం, అందమైన విజువల్స్, మ్యాజికల్ మ్యూజిక్ తో’ సీతా రామం’ ఒక ఎపిక్ లవ్ స్టోరీగా ఉండబోతోందని టీజర్ భరోసా ఇస్తుంది.

 

”సీతా రామం” తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతుంది. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

టీజర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘సీతా రామం’ టీజర్ కి వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకంటే వండర్ ఫుల్ గా సినిమా వుండబోతుంది.  ‘సీతా రామం’ మెమరబుల్ మూవీ. అద్భుతమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. దేశంలో చాలా ప్రదేశాలు చూసే అవకాశం దక్కింది, దర్శకుడు హను రాఘవపూడి, స్వప్న గారి సపోర్ట్ కి కృతజ్ఞతలు. విశాల్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు.  సీతా రామం’ కథ గొప్పగా వుంటుంది. సినిమా విజువల్ వండర్ గా వుండబోతుంది” అన్నారు

 

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది.  ప్రేక్షకుల కి వండర్ ఫుల్ ఎక్సపిరియన్స్ ఇవ్వడానికే వందల మంది రెండేళ్ళుగా కష్టపడ్డాం. దుల్కర్ సల్మాన్  ని లెఫ్ట్నెంట్ రామ్ పాత్రలో ఇంకా ఇష్టపడతారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ ప్రయాణం లో సపోర్ట్ గా నిలిచిన దుల్కర్ , నిర్మాత స్వప్న గారికి థాంక్స్. చాలా వైవిధ్యమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరీంచాం. మైనస్ 24 డిగ్రీల వద్ద కూడా షూట్ చేశాం, ఇది దుల్కర్, స్వప్న  గారి సపోర్ట్ వలెనే సాధ్యపడింది” అన్నారు

 

సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం చాలా అద్భుతమైన టీమ్ పని చేసింది. ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది. దుల్కర్, స్వప్న, హను గారితో పని చేయడం ఆనందంగా వుంది” అన్నారు.

 

ఈ సందర్భంగా మీడియా, అభిమానులు అడిగిన ప్రశ్నల కి సీతారామం యూనిట్ సమాధానాలు ఇచ్చారు.

 

మహానటితో ఒక మార్క్ సెట్ చేశారు. సీతారామంతో ఒక నటుడిగా ఎలాంటి మార్కులు పడతాయని భావిస్తున్నారు ?

దుల్కర్ : వైజయంతి మూవీస్ పై నాకు అపారమైన నమ్మకం వుంది. దర్శకుడు హను గారు ఈ కథని చెప్పినపుడు ఎపిక్ లవ్ స్టొరీ అనిపించింది. నేను ఎంత స్కోర్ చేస్తానో తెలీదు కానీ సినిమా స్కోర్ చేస్తే నేను హ్యాపీ. 

 

హను రాఘవపూడితో పని చేయడం ఎలా అనిపించింది ?

దల్కర్ : హను రాఘవపూడి ఎనర్జిటిక్ డైరెక్టర్. ఆయనకి పని తప్ప మరో ధ్యాస లేదు. చుట్టూపక్కల ఏమున్నాయో కూడా చూసుకోరు. తన ఫోకస్ అంతా సినిమాపైనే వుంటుంది.  నేను 35పైగా సినిమాలు చేసుంటాను. హను మాత్రం చాలా ప్రత్యేకం.

 

‘సీతారామం’లో  పాన్ ఇండియా స్థాయిలో వుండే విలక్షణమైన అంశాలు ఏమిటి ?

హను రాఘవపూడి: అందరికీ కనెక్ట్ అయ్యే కామన్ పాయింట్ సీతారామం. గ్రేట్ లవ్ స్టొరీ. ఇందులో వుండే ప్రాసస్ అంతా కొత్తగా వుంటుంది. ఖచ్చితంగా ఇది మ్యాజికల్ లవ్ స్టొరీ. చూసే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది.

 

మహానటి ఎపిక్ హిట్ అయ్యింది కదా ? మళ్ళీ దుల్కర్ తో చేస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు వున్నాయి?

స్వప్న దత్: మహానటిలో కాస్త నెగిటివ్ షేడ్స్ వున్న జెమినీ గణేశన్ గారి పాత్రని దుల్కర్ అద్భుతంగా చేశారు. దుల్కర్ కి మా మీద నమ్మకం ఎక్కువ. ఆయనకి కథ పంపించే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాం. అలా ఆచితూచి ఎంపిక చేసుకున్న తర్వాత ఈ కథని దుల్కర్ కి పంపించా. ఆయన ఓకే చెప్పారు. ఆయన నమ్మకం మాకు ఇంకా బాధ్యతని పెంచుతుంది. తనకి మరో సూపర్ హిట్ ఇవ్వాల్సిన భాద్యత నాపై వుంది. 

 

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: హను రాఘవపూడి

నిర్మాత: అశ్వినీదత్

బ్యానర్: స్వప్న సినిమా

సమర్పణ: వైజయంతీ మూవీస్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్

ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు

ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, అలీ

కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

పీఆర్వో : వంశీ-శేఖర్

You may also like
Sita Ramam Movie Song Launch
Vijayendra Prasad Launched Sumanth Movie “Aham Reboot” First Look
Pushpa Movie Thanks Meet
Pushpa Movie Pre Release Event Set-1

Leave a Reply

Translate »