Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > REVIEWS > Jagannatakam Movie Review

Jagannatakam Movie Review

**జగన్నాటకం** మూవీ రివ్యూ

 

**జనం మెచ్చిన ‘జగన్నాటకం’**

**రెండు కథలు, ఆరు పాత్రలతో అద్భుతమైన స్క్రీన్ ప్లే…**

**మంచి విలువలతో కూడిన ఎమోషనల్ సినిమాగా విజయం. **

**c/o కంచరపాలెం,వేదం, తమిళంలో సూపర్ డీలక్స్ వంటి మరో మంచి చిత్రం.**

Rating 3.5/5

**కథ :**
* రెండు వేర్వేరు కథల్లోని దారితప్పిన ఆరు పాత్రల ప్రయాణన్ని…. కంటికి కనిపించని ఒక పాజిటివ్ ఎనర్జీ ( దైవం) మరల తిరిగి ఆ పాత్రల యొక్క ప్రయాణాన్ని సరైన గమ్యస్థానానికి ఎలా చేర్చింది?? అనేది ఈ జగన్నాటకం చిత్రం యొక్క కథ…

ఈ చిత్రం విశాఖపట్నం బస్ స్టేషన్ లో మారేపల్లి గ్రామం నుంచి రాజు అనే వ్యక్తి, మొగిలిపాడు గ్రామం నుంచి మహాలక్ష్మి అనే అమ్మాయి ఒకే సమయంలో రెండు వేరు వేరు బస్సుల్లో నుంచి దిగడంతో ప్రారంభమవుతుంది.
రాజు రెండు సంవత్సరాల క్రితం తనని వదిలి వచ్చేసిన ప్రేయసి సరస్వతి ని వెతుక్కుంటూ….. లక్ష్మి ఎవరో చెప్పిన మాటలు విని పట్నం మీద మోజుతో తన భర్త ఏడుకొండలు,నాలుగు సంవత్సరాల కూతురు జ్యోతి ని విడిచిపెట్టి పట్నం వచ్చేయడం….
తన ను వదిలేసి వెళ్ళిపోయిన తల్లి కోసం ఎదురుచూస్తూ ఏడుస్తూ ఉండే కూతురు బాధను చూడలేక ఎలా అయినా తన భార్యని తిరిగి ఇంటికి తీసుకు వస్తానని వాళ్ళమ్మకు మాటిచ్చి ఏడుకొండలు పట్నం బయలుదేరుతాడు…
అలా వచ్చిన ఏడుకొండలు కి ఒక యాక్సిడెంట్ ద్వారా గౌతమ్ అనే ఒక కుర్రాడు తో పరిచయం ఏర్పడుతుంది…(గౌతమ్ పెళ్లి అనే బంధం మీద అయిష్టంగా ఉంటూ అమ్మాయిలంటే కేవలం పడక సుఖానికి మాత్రమే అనుకునే ఒక క్యారెక్టర్)…
తనకు పరిచయం అయినా గౌతమ్ కి ఏడుకొండలు తన భార్య కోసం చెప్పడం.. ఏడుకొండలు చెప్పిన కథ అంతా విన్న గౌతం ఇక్కడినుంచి మీరు ఖచ్చితంగా మీ భార్యతోనే మీ ఇంటికి వెళ్తారు అని మాట ఇవ్వడం జరుగుతుంది…
ఇంకోవైపు సరస్వతి కోసం రాజు వెతుకుతూ ఉంటాడు. లక్ష్మీ తనకి తెలియని కొత్త ప్రపంచంలో ఏం చేయాలో తెలీక రోడ్డు మీద తిరుగుతూ ఉండగా అనుకోని పరిస్థితుల్లో గౌతమ్ పంచన చేరుతుంది.. లక్ష్మీ అమాయకత్వం. తన ప్రవర్తనచూసి అప్పటివరకు అమ్మాయిలపై తనకున్న అభిప్రాయాన్ని తప్పు అని తెలుసుకుని గౌతమ్ తన తో ప్రేమలో పడతాడు… తనని పెళ్లి చేసుకుని తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటాడు… కానీ లక్ష్మి ఏడుకొండలు భార్యని గౌతమికి తెలియదు… ఇంకోవైపు లక్ష్మి కూడా పట్నం మీద ఉన్న మోజుతో గౌతమ్ కి ఆకర్షణ అవుతుంది… ఇదిలా ఉండగా లక్ష్మి కి తన మనసులో మాట చెప్పడానికి గౌతమ్ బయటికి తీసుకెళ్లినప్పుడు అదే సమయంలో తన స్నేహితుడి ద్వారా లక్ష్మి ఏడుకొండలు భార్య అనే నిజం గౌతమ్ కి తెలుస్తుంది…
ఇంకోవైపు సరస్వతి ని వెతుకుతూ తిరుగుతున్న రాజు కి సరస్వతి కనిపించడం తో తన దగ్గరికి వెళ్లగా తను ఒక వేశ్యగా తన జీవితాన్ని గడుపుతున్న విషయం తెలుసుకుంటాడు… సరస్వతి కి క్షమాపణలు చెప్పి తనతో రమ్మనగా తను రాను అంటుంది.. తనతో ఉన్న కుర్రాళ్ళతో రాజుని కొట్టిస్తుంది… తగిలిన గాయాలకు హాస్పటల్ లో చికిత్స పొందుతూ రాజు తన గతం గుర్తు చేసుకుంటాడు….
మారేపల్లి గ్రామం లో తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఒక చిన్న సెల్ పాయింట్, తన ముగ్గురు స్నేహితులు తప్ప రాజు కి వేరే ప్రపంచం తెలియదు… అలాంటి రాజు ఆ ఊరి ప్రెసిడెంట్ కూతురైన సరస్వతిని చూసి ప్రేమించగా తను కూడా రాజును ప్రేమిస్తుంది..ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజు సరస్వతిని కలుసుకోవడానికి సరస్వతి ఇంటికి వెళ్తాడు… అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగే రొమాన్స్ ని వాళ్ళ ప్రేమకు గుర్తుగా, ఎప్పుడైనా వాళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఈ వీడియో చూసుకుంటే తమ ప్రేమ గుర్తుకు వచ్చి కలిసి పోవచ్చని రాజు ఫోన్ లో వీడియో తీస్తాడు… వీళ్ళిద్దరి విషయం తెలిసిన సరస్వతి బావ సాయి, రాజు స్నేహితులను కొట్టి,రాజును తన దగ్గర రమ్మంటాడు.. రాజు సాయి దగ్గరకు వెళ్లగా, వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే ఘర్షణలో రాజు యొక్క ఫోన్ కింద పడి పోతుంది.. అలాగే రాజు పక్కనే ఉన్న కర్రతో సాయి తల మీద కొట్టగా అతను స్పృహ తప్పి పడిపోతాడు.. నెత్తుటి మడుగులో పడివున్న సాయి చూసి చనిపోయాడెమో అనే భయం తో రాజు ఊరు నుంచి పారిపోతాడు… అలా కిందపడిపోయిన ఫోను సాయి కి దొరుకుతుంది. అందులో రాజు సరస్వతిల వీడియో చూసిన సాయి, రాజు మీద కోపంతో ఆ వీడియోను వైరల్ చేసి అందులో ఉన్న ఫోటోలను ఊరంతా అంటిస్తాడు.. ఇది చూసిన ప్రెసిడెంట్ తన కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు… సరస్వతి రాజు కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఆఫ్ అయి ఉంటుంది.. తను ప్రేమించిన రాజు తనను మోసం చేశాడని భావించిన సరస్వతి పట్నం వచ్చేస్తుంది. కొన్ని అనుకోని కారణాలవల్ల తను వేశ్య గా మారుతుంది…
ఇంకోవైపు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, తన స్నేహితుడు ఏడుకొండలు భార్య అని తెలిసిన గౌతం ప్రేమ కంటే పెళ్లి అనే బంధం గొప్పదని లక్ష్మి తనతో కంటే ఏడుకొండలు తో ఉంటేనే న్యాయమని భావించి లక్ష్మి నీ ఎలాగైనా ఏడుకొండల తో కలపాలని నిర్ణయించుకుంటాడు…. ఆ ప్రయత్నంలో లక్ష్మికి తనపై కోపం కలిగేలా మాట్లాడి… లక్ష్మి కి తన మీద అసహ్యం కలిగేలా చేస్తాడు… ఇలా గౌతం నుంచి అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంది… గౌతం తనని కాపాడి హాస్పిటల్ లో చేర్చి తన స్నేహితురాలు అయినా నర్స్ ద్వారా లక్ష్మీ తిరిగి తన ఊరు వెళ్లేలా ఒప్పిస్తాడు… అలాగే ఏడుకొండల కి ఫోన్ చేసి లక్ష్మీ బస్టాప్ లో ఉందని, వెళ్లి కలుసుకోమని చెప్తాడు…. అలా వెళ్లి లక్ష్మిని కలుసుకున్న ఏడుకొండలు లక్ష్మిని ఇంటికి తిరిగి వచ్చే మని కోరగా, తన తప్పు తెలుసుకున్న లక్ష్మి ఏడుకొండలు కి క్షమాపణ చెప్పి తనతో తిరిగి తన ఊరు వెళ్ళి పోతుంది…
ఇంకోవైపు రాజు మళ్లీ సరస్వతి ని కలిసి జరిగిందానికి కారణం వాళ్ల బావ సాయి అని.. ఆ విషయం తెలిసి తన కాలు నరికేసి జైలుకు వెళ్లి వచ్చానని తనకు నిజం చెప్తాడు… అలా నిజం తెలుసుకున్న సరస్వతి తను ఇది వరకటి సరస్వతి కాదని తను చెడిపోయాను అని తనను వదిలి వెళ్ళిపో, అంటుండగా రాజు తన మెడలో తాళి కడతాడు… జరిగిన తప్పు కి కారణం ఇద్దరం అని, జరిగింది మరిచి కొత్త జీవితం ప్రారంభించాలని వాళ్లు తిరిగి వాళ్ళ ఊరు వెళ్తారు… అలా ఊరు వెళ్లిన వీళ్లు సరస్వతి నాన్నని కలవగ, తప్పు తెలుసుకుని వచ్చిన వారిని వాళ్ల నాన్న క్షమించి దగ్గరకు తీసుకుంటాడు….
అలాగే లక్ష్మి ఏడుకొండలు వాళ్ళ ఊరు తిరిగి వెళ్లగా అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్న జ్యోతి తిరిగి వచ్చిన వాళ్లను చూసి ప్రేమతో పరుగులు తీసి వాళ్ళను హత్తుకుంటుంది…..
అనుకోని విధంగా ఎదురైనా రెండూ పరిచయాలు ( ఏడుకొండలు, లక్ష్మి ) తన జీవితాన్ని మార్చేశాయి అని … ఆ జ్ఞాపకాలతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి గౌతమ్ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు……

*తెలిసో తెలియకో చేసిన తప్పు మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది … చేసిన తప్పు తెలుసుకుని మనం పశ్చాత్తాపం పొందినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ( దైవం ) బ్రతకడానికి ఇంకో దారి ఎలా చూపిస్తుంది… అనే ఉద్దేశ్యంతో ఈ జగన్నాటకం ముగుస్తుంది… ఇంత మంచి కధా కధనం తో కూడిన స్క్రీన్ ప్లే 70mm స్క్రీన్ మీద చూడాల్సిందే

**నటీనటులుః**
జగన్నాటకం సినిమాలో అన్నిపాత్రలు చాలా దగ్గరగా మనం చుట్టూ చూస్తున్న విధంగా ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ నటి ఆలపాటి లక్ష్మి గారు చాలా సహజంగా గ్రామీణ ప్రాంతానికి తగిన విధంగా బంగారమ్మ పాత్రలో ఇమిడిపోయారు, ఇందులో కేరింత ఫేం పార్వతీశం రాజు పాత్ర కొత్త తరహాలో కనబరిచారు, కుమారస్వామి గౌతమ్ అనే ఒక మోడెరెన్ ప్లే బాయ్ పాత్రలో యువతను ఆకట్టుకునే విధంగా మంచి నటనతో మెప్పించారు, మిగిలిన వారు శ్రీను పెనుమూడి, స్వాతి మండల్, అర్పిత లోహి, బేబీ రోషిణి , సాయి రెబల్, హిమజ చెల్లూరి నూతన నటీ నటులు అయినా వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.

**టెక్నీషియన్లుః**
దర్శకుడు రాజ్ అల్తాడ ఈ సినిమా కథని రాసుకున్న తీరు చాలా బాగుంది. ఇదే సినిమాకి బలం. తాను చెప్పాలనుకున్న అంశాలను నీట్‌గా, క్లీయర్‌గా తెరపై ఆవిష్కరించారు. అయితే మొదట్లో కథని కాస్త నెమ్మదిగా మొదలుపెట్టిన ఆయన ఇంటర్వెల్‌ తర్వాత వేగాన్ని పెంచారు. డ్రామా కాస్త ఎక్కువైన ఫీలింగ్‌. నూతన దర్శకుడు అవడం వలన దర్శకత్వం కొంచెం అటు ఇటుగా అనిపించినప్పటికీ మంచి డైలాగ్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. సినిమా నిడివి ఎక్కువ వలన కొంచెం తగ్గించి ఉన్నంతలో కథను క్లియర్ గా చెప్పాల్సింది . ఓవరాల్‌గా దర్శకుడిగా తన తొలి ప్రయత్నం వృధా పోలేదని చెప్పాలి. ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ పనితీరు స్క్రీన్ పైన తెలుస్తుంది. కెమెరా వర్క్ మరియు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగున్నాయి. కధకు తగిన వ్యయంతో మంచి నిర్మాణ సారథ్యంతో సినిమాను నిర్మించి వై వి కె ఎస్ బ్యానర్లో జగన్నాటకం సినిమాను ఈ నెల 22న వెండి తెరపై విడుదల చేశారు .

**ఫైనల్‌గాః**
`జగన్నాటకం` ( జెన్యూన్ అటెమ్ట్) ఒక నిజజీవితంలోజరిగిన,జరుగుతున్న చిన్న కథ,కానీ పెద్ద సందేశం. కమర్షియాలిటీ, వినోదం అనే అంశాలు పక్కన పెట్టి చూస్తే సినిమా అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్త కథలు మరియు మంచి సినిమాలు అభిమానులకు మరింతగా నచ్చుతుంది…ఒకటే చెబుతాను ప్రతి ఒక్కరు చుడాల్సిన చిత్రం, ముఖ్యంగా నేటి యువత చూసి ఏం చేయరాదో, చేయకూడదో వివరించే చిత్రం, ఇందులో సారాంశం..! రివ్యూ @ SHIVA DEV?️

Rating 3.5/5

Leave a Reply

Translate »