Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Alluri Movie Teaser Launch

Alluri Movie Teaser Launch

 

శ్రీవిష్ణు, ప్రదీప్ వర్మ, లక్కీ మీడియా ‘అల్లూరి’ టీజర్ గ్రాండ్ గా విడుదల

 

హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫిక్షనల్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నిజాయితీకి మారుపేరు’ అనేది ఉపశీర్షిక. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ’అల్లూరి’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

 

”ఎక్కడి దొంగ‌లు అక్కడే గ‌ప్ చుప్‌.. పోలీస్ బ‌య‌ల్దేరాడు రా” అనే డైలాగ్ తో టీజర్ లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు  శ్రీవిష్ణు. నేరస్తులని వెంటాడటం, వారికి పోలీస్ పవర్ చూపించడం, నక్సల్ స్థావరానికి వెళ్లి ” ఎస్‌ఐ అల్లూరి సీతారామరాజు” అని తనని తాను పరిచయం చేసుకొని తెగువ చూపడం ఆసక్తికరంగా వుంది.

 

శ్రీవిష్ణు, అల్లూరి పాత్రలో డైనమిక్‌ & పవర్ ఫుల్ గాకనిపించారు. ఈ పాత్ర కోసం శ్రీవిష్ణు పూర్తి ట్రాన్సఫర్మేషన్ కావడం టీజర్లో విశేషంగా కనిపిస్తుంది. దర్శకుడు ప్రదీప్ వర్మ అల్లూరి పాత్రకు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ మూడ్ సెట్ చేసింది. టీజర్‌ ని చూస్తే అల్లూరి గ్రిప్పింగ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా ఉండనుందని అర్ధమౌతుంది.

 

కథానాయికగా నటించిన కయదు లోహర్, కీలక పాత్రలో నటిస్తున్న సుమన్ లను టీజర్ లో రివీల్ చేయలేదు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

 

టీజర్ రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా వుంది.  దర్శకుడు ప్రదీప్ తో నాలుగేళ్ళుగా ప్రయాణిస్తున్నా. అల్లూరి సీతారామరాజులో వుండే ఆవేశం దర్శకుడు ప్రదీప్ లో చూశాను. సైనికులు, పోలీసులు, వైద్యులు..  ఈ ముగ్గురిని రియల్ హీరోస్ గా చూస్తా. ఇలాంటి పాత్రలు వచ్చినపుడు చాలా నిజాయితీ వుండి నచ్చితేనే చేయాలనీ అనుకునేవాడిని. సరిగ్గా ఇదే సమయంలో నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ పాత్ర దొరికింది. ఈ పాత్ర చేసిన తర్వాత నేను ఎందుకు పోలీసు అవ్వలేదని అనుకున్నాను. నా కెరీర్ బెక్కెం వేణుగోపాల్ గారితోనే మొదలైయింది. ఆయనతోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నా. ఇది ఫిక్షనల్ బయోపిక్. రియల్ గా జరిగిన సంఘటనని తీసుకొని ఒక కథగా చేశాం. టీం అంతా అద్భుతంగా పని చేసింది. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. నేటి సమాజానికి కావాల్సిన సినిమా ఇది” అన్నారు.

 

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ టీజర్ ని లాంచ్ చేయడం , టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఈ రోజు నుండి సినిమా విడుదలయ్యేంత వరకూ పబ్లిసిటీ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతాయి. మేము నిర్మించిన చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అల్లూరి చాలా స్పెషల్ మూవీ. అన్ని కమర్షియల్ హంగులు వున్న గొప్ప సినిమాగా అల్లూరి ఉండబోతుంది. ఒక గొప్ప సినిమా తీశాననే తృప్తిని ఇచ్చిన చిత్రం అల్లూరి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలి” అని కోరుకున్నారు .

 

దర్శకుడు ప్రదీప్ వర్మ మాట్లాడుతూ..  అల్లూరి ఒక నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్. 16 ఏళ్ళ వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒక నిజాయితీ గల పోలీసు అధికారి ఏం చేశారనేది ఆయన ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాం.  ఈ సినిమాని చూసిన అందరికీ పోలీసుపై చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులు ఖచ్చితంగా పోలీసులకు సెల్యూట్ చేస్తారు. ఈ చిత్రం విషయంలో నాకు మొదటి నుండి ఎంతో ప్రోత్సహించిన హీరో నారా రోహిత్ గారికి కృతజ్ఞతలు ” తెలిపారు. 

 

శివాజీ మాట్లాడుతూ.. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు నాకు మంచి మిత్రులు. మేము ఎప్పటి నుండో ప్రయాణం చేస్తున్నాం. ఆయన ప్రతి కథ నాకు చెప్తారు. అల్లూరి కథ కూడా చెప్పారు. నిర్మాత, డిస్ట్రిబ్యుటర్  ప్రశాంతంగా బతకాల్సిన సినిమా ఇది. దర్శకుడు అద్భుతమైన కథని తయారు చేసుకున్నారు. పోలీసు కథలకు ఎప్పుడూ పవర్ వుంటుంది. అల్లూరిలో కథలో కూడా సూపర్ పవర్ వుంది. శ్రీవిష్ణు ఎప్పుడూ కొత్తకథలుచేయడానికి ఇష్టపడతాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా ఖచ్చితంగా కొత్తదనం ఫీలౌతారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు. 

 

హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. బెక్కెం వేణుగోపాల్ మంచి అభిరుచి గల నిర్మాత. ఆయన ప్రతిభ వున్న వాళ్ళని ప్రోత్సహిస్తారు. విష్ణు గారు ఎప్పుడూ కొత్తకథలు ఎంపిక చేసుకుంటారు. ఈ కథ కూడా చాలా నిజాయితీ వున్న కథగా కనిపిస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి.” అని కోరుకున్నారు.

 

ప్రసన్న మాట్లాడుతూ.. ‘నిజాయితీకి మారుపేరు’ అనే టాగ్ లైన్ పెట్టడం అంత తేలిక కాదు. కథ కథనంలో దమ్ముఉంటేనే ఇలాంటి పేరు పెట్టగలం. టీజర్ ఆసక్తికరం గా వుంది. శ్రీవిష్ణు గారు అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి చిత్ర యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకురావాలి” అని కోరుకున్నారు. 

 

డీవోపీ రాజ్ తోట మాట్లాడుతూ.. మా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు అద్భుతమైన ప్రొడ్యుసర్ ఆయన ఈ సినిమా ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. లక్కీ మీడియా బ్యానర్ లో అల్లూరి మరో బిగ్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ప్రదీప్ వర్మ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. విష్ణు గారితో ఇది నాకో రెండో సినిమా. ఆయన్ని మరో లెవెల్ లో చూశాను. ఈ చిత్రం తర్వాత నెక్స్ట్ లెవెల్ కథల తో విష్ణు వస్తారని భావిస్తున్నా” అన్నారు.

 

ఈ చిత్రానికి  ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా, విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

 

ఒక పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. అల్లూరి రిలీజ్ డేట్ త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు.

 

తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు.

 

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: ప్రదీప్ వర్మ

నిర్మాత: బెక్కెం వేణుగోపాల్

బ్యానర్: లక్కీ మీడియా

సమర్పణ: బెక్కెం బబిత

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

డీవోపీ: రాజ్ తోట

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

ఆర్ట్ డైరెక్టర్: విఠల్

ఫైట్స్: రామ్ క్రిషన్

సాహిత్యం: రాంబాబు గోసాల

సౌండ్ ఎఫెక్ట్స్: కె రఘునాథ్

పీఆర్వో: వంశీ-శేఖర్

You may also like
Sree Vishnu Interview
Sree Vishnu Interview Photos
Arjuna Phalguna Trailer launch by Koratala Siva
Bhala Thandanana Movie Launch

Leave a Reply

Translate »