ఎలెవన్ పాయింట్ టూ ఆధ్వర్యంలో డిసెంబర్ 18న ఫాబ్లోస్ 5 పేరుతో లైవ్ కాన్సర్ట్ శిల్పకళా వేదిక లో..
ఇండియన్ ఐడల్ 12 టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ లో హైదరాబాద్ శిల్పకళా వేదికలో డిసెంబరు 18న లైవ్ కాన్సర్ట్ జరగనుంది ప్రసాద్ లాబ్ లో నిర్వహించన విలేకరుల సమావేశంలో ఫాబ్లోస్ 5 పేరుతో లైవ్ కాన్సర్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇండియన్ ఐడల్ సింగర్స్ పవనదీప్, అరుణిత, సైలి, డానిష్ మరియు తెలుగు రాక్ స్టార్ షణ్ముఖ ప్రియ కలిసి హైదరాబాద్ ప్రేక్షకులను అలరించనున్నారు.
ఈవెంట్ నిర్వహకులు మాట్లాడుతూ ఒకే వేదిక పై ఐదుగురు సింగర్స్ కలిసి పాడటం చాలా కష్టం, అదే కాకుండా ఇండియన్ ఐడల్ సింగర్స్ పాడటం ఇండియాలో ఇదే మొట్టమొదటి షో . ఈ కాన్సర్ట్ ఒక సంగీత మహోత్సవం లా జరగనుంది. మన తెలుగు రాక్ స్టార్ షణ్ముఖ ప్రియ తన పాటల తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానుంది. ఈ కాన్సర్ట్ ని ఎలెవన్ పాయింట్ టూ మరియు మెటలోయిడ్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్వహింస్తున్నారు.