వీరాభిమాని కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి పరామర్శ
గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ ఈరోజు ఉదయం గుండెపోటు తో మరణించారు. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి హటాహుటిన తన అభిమాని ఇంటికి చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
కుటుంబసభ్యులను పరామర్శించి తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నూర్ మహ్మద్ తన వీరాభిమాని అని ఆయన మరణం తీరని లోటని బాధను వ్యక్తం చేశారు. తోటి అభిమానులందరికీ బాధాకరమైన సంఘటన అని అన్నారు.ఆయన్ని తిరిగి తీసుకొని రాలేను కానీ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి కుటుంబ సభ్యులును ఓదార్చారు.