శ్రీరంగాపురం రివ్యూ!
నటీనటులుః వినాయక్ దేశాయ్, పాయెల్ ముఖర్జీ,
చిత్రం శ్రీను, జబర్దస్త్ రాజమౌళి, శ్రావణ సంధ్య, వైష్ణవి సింగ్, గీతా సింగ్, దుర్గారావు తదితరులు
సాంకేతిక నిపుణులుః
నిర్మాతః చిందనూరు నాగరాజు,
దర్శకత్వంః ఎమ్ ఎస్ వాసు
సంగీతంః స్వర సుందరం
రేటింగ్ః 3/5
ఇటీవల కాలంలో బంధాలు, బంధుత్వాలు, ప్రేమల, ఆప్యాయతలు కు సంబంధించిన చిత్రాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంగా ..మేనమామ, మేనకోడలు మధ్య ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయో మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు చిందనూరు నాగరాజు, ఎమ్ ఎమ్ వాసు. పాటలు, ట్రైలర్ తో ఆకట్టుకున్న చిత్రం ఈ రోజు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
శ్రీరంగాపురం అనే ఒక గ్రామంలో పెద్దారెడ్డి అనే ఒక పెద్దమనిషి ఉంటాడు. ఆయన మాటంటే ఆ ఊరి జనాలకు వేదం….శత్రువులకు ఆయనంటే ముచ్చెమటలు. మేనకోడలు అంటే ప్రాణం. ఇలాంటి తరుణంలో ఆ ఊళ్లో ఏం జరిగింది. మేనకోడలు కోసం ఎలాంటి త్యాగాలు చేశాడు అనేది సినిమా.
పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు కొత్తవారైనా కథకు సరిగ్గా సరిపోయారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే చిత్రాలు ఎప్పూడు ఆసక్తికరంగా ఉంటాయి. సంభాషణలు, పాటలు, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అక్కడక్కడా హీరో ఫ్రెండ్స్ చేసే కామెడీ సన్నివేశాలు కొంత బోర్ కొట్టించినా…మిగతా సీన్స్ ఆ బోర్ ఫీల్ లేకుండా చేశాయి. చిత్రం శీను క్యారక్టర్ ఎందుకు ఉందో తెలియదు. ఎడిటర్ ఇంకాస్త ట్రిమ్ చేస్తే సినిమా ఇంకా బాగుండేది.
కొత్త సన్నివేశాలు లేకపోయినా….ఉన్న సీన్స్ ఆకట్టుకునేలా తీశారు. ఇందులో నిర్మాత పోషించిన పెద్దారెడ్డి పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. హీరో మెచ్యూర్ గా నటించాడు. విలన్ గా సత్య ప్రకాష్, ఆయన తనయుడు రోబో గణేష్ రాణించారు.
తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మేనమామ అంటూ ఈ చిత్రంలో ఇచ్చిన సందేశం చాలా బాగుంది. తన మేనకోడలు కోసం తనకు పిల్లలు కూడా వద్దనుకుని మేనకోడలే ప్రాణంగా బతికిన పెద్దారెడ్డి చేసిన త్యాగం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సింది.
ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన చిత్రం శ్రీరంగాపురం.